`సాహో` రిలీజ్ డేట్ ఫిక్సైనట్టేనా!!?
on Nov 20, 2018
`బాహుబలి` చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం `సాహో`. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...`సాహో` చిత్రాన్ని అగస్టు 15న స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా....ఊహగానాలు మాత్రం ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తన తదుపరి చిత్రంలో బిజీ గా ఉన్నాడు. స్టైలిష్ అండ్ హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంగీతం ఎహసాన్ లాయ్ , బాలీవుడ్ నటి శ్రధ్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.