English | Telugu

'సాహో' హిందీ చిత్రమా? తెలుగు చిత్రమా?

on Jul 8, 2019

అంతర్జాతీయ స్థాయిలో 'సాహో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు మేకింగ్ వీడియోలు చూస్తే ఆ సంగతి స్పష్టమవుతుంది. భారీగా డబ్బులు ఖర్చు పెట్టారని కూడా తెలుస్తుంది. ఫైట్స్ లో హాలీవుడ్ స్టయిల్ ప్రేక్షకులకు నచ్చింది. కానీ, ఈ రోజు విడుదలైన తొలి పాట 'సైకో సయ్యా' చూస్తే... సాహో హిందీ చిత్రమా? తెలుగు చిత్రమా? అనే అనుమానం కలుగుతోంది. సాంగ్ ట్యూన్, పిక్చరైజేషన్, ఆ స్టయిల్.... అంతా హిందీ సినిమా టైపులో ఉంది. ముఖ్యంగా లిరిక్స్ అయితే డబ్బింగ్ సాంగును తలపిస్తున్నాయి. దీనికి తోడు పాటలో ప్రభాస్ కంటే శ్రద్ధ కపూర్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం తెలుగు ప్రేక్షకులకు రుచించడం లేదు. సినిమాకు హైప్ తీసుకు రావాల్సిన ఫస్ట్ సాంగ్ కాస్త... హార్డ్ కోర్ ప్రభాస్ అభిమానులను నిరాశ పరిచింది. సాంగ్ పిక్చరైజేషన్ చేసిన స్టయిలే తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం లేదు. మాస్ ప్రేక్షకులకు ఈ పాట చేరువ కావడం అసాధ్యమే. ఇప్పటి వరకు విడుదల చేసిన సినిమా స్టిల్స్, పబ్లిసిటీ ప్లాన్ అంతా బాలీవుడ్ సినిమాలను తలపించింది. తెలుగు ప్రేక్షకులకు కిక్ ఎక్కించే స్టిల్ ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు ఈ సాంగ్ నిరాశపరచడంతో ప్రభాస్ అభిమానులు డీలా పడుతున్నారు. తెలుగులో భారీ ఓపెనింగ్స్ రావాలంటే మాస్ కమర్షియల్ స్టిల్స్, సాంగ్స్ రావాల్సిందే.


Cinema Galleries



Latest News


Video-Gossips