English | Telugu

'సాహో'కి ముందు చిన్న సినిమాల జాతర

on Aug 23, 2019

 

ఆగస్టు 30న 'సాహో'తో ప్రభాస్ థియేటర్లలోకి రానున్నాడు. అంటే... సినిమా విడుదలకు ఏడు రోజులు మాత్రమే వుంది. ఆల్రెడీ ప్రేక్షకులకు 'సాహో' ఫీవర్ పట్టుకుంది. అందుకని, ఈ సినిమాకు ముందు వెనుక మాదిరి సినిమాలు థియేటర్లలోకి వచ్చే సాహసం చేయలేదు. ముఖ్యంగా విడుదలకు ముందు మినిమమ్ క్రేజ్ ఉన్న సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దాంతో ఈ శుక్రవారం థియేటర్లు అన్నీ వెలవెలబోయాయి. అలాగని, ఈ వారం అసలు సినిమాలేవీ విడుదల కావడం లేదా? అంటే అదీ కాదు. మొత్తం మీద ఏడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. చిన్న సినిమాల జాతర అన్నమాట. ఏడు చిత్రాల్లో ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కౌశల్య కృష్ణమూర్తి' కొంచెం చెప్పుకోదగ్గది. నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న 'ఏదైనా జరగొచ్చు' కూడా ఈ రోజే విడుదలైంది. తమిళ నటుడు బాబీ సింహా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఎందుకనో అనుకున్న క్రేజ్ రాలేదు. ఇక, షకలక శంకర్ నటించిన 'నేనే కేడీ నంబర్ 1', మిగతా సినిమాలు 'నివాసి', 'బోయ్', 'నీతోనే హాయ్ హాయ్', 'హవా' సినిమాలు విడుదలవుతున్న సంగతి పెద్దగా ఎవరికీ తెలియదు.


Cinema Galleries



Latest News


Video-Gossips