బర్త్ డే స్పెషల్: టాలీవుడ్ డార్లింగ్ టు ఇండియన్ రెబెల్ స్టార్
on Oct 23, 2015
.jpg)
గత పుట్టినరోజులతో పోలిస్తే ఈ సారి బర్త్ డే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్కు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ డార్లింగ్ స్టార్ గా వుండే ప్రభాస్.. బాహుబలి గ్రాండ్ సక్సెస్ తరువాత ఇండియన్ రెబెల్ స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ కెరీర్లో హిట్ సినిమాలన్నీ ఓ ఎత్తు.. ఇప్పుడు ‘బాహుబలి’ మరో ఎత్తు. ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన టాప్ హిట్స్ ఫిల్మ్ ఓ సారి చూద్దాం:
1. వర్షం

ప్రభాస్ తొలి కమర్షియల్ హిట్ సినిమా ఇది. ఈ సినిమాతో యాంగ్రీ యంగ్ మ్యాన్ పేరు తెచ్చుకున్నాడు.
2. ఛత్రపతి

ఈ సినిమాతో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తో పాటు.. బాక్స్ ఆఫీస్ 'ఛత్రపతి' అయ్యాడు.
3. డార్లింగ్
.jpg)
డార్లింగ్ తో అమ్మాయిల 'డార్లింగ్' గా మారిపోయాడు.
4. మిస్టర్ పెర్ఫెక్ట్

మిస్టర్ పెర్ఫెక్ట్ తో ఫ్యామిలీల డార్లింగ్ గా మారి 'మిస్టర్ పెర్ఫెక్ట్' గా నిలిచాడు.
5. మిర్చి
.jpg)
'మిర్చి'తో తన కమర్షియల్ సత్తాను బాక్స్ ఆఫీస్ కు రుచి చూపించాడు.
6. బాహుబలి
.jpg)
'బాహుబలి' టాలీవుడ్ డార్లింగ్ ని ఇండియన్ రెబెల్ స్టార్ గా మార్చేసింది.
ప్రభాస్ తన కేరియర్ లో మరింత ఉన్నత శిఖరాల్ని అందుకోవాలని ఆశిస్తూ.. అతడికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది తెలుగువన్.కామ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



