ప్రభాస్‌కు హిందీ ‘అర్జున్‌రెడ్డి’ నచ్చాడు
on Apr 15, 2019
విజయ్ దేవరకొండ బాగా చేశాడా? షాహిద్ కపూర్ బాగా చేశాడా? ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ టీజర్ విడుదలైన తరవాత సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చర్చ నడిచింది. తెలుగు ప్రేక్షకుల్లో విజయ్ దేవరకొండ బాగా చేశాడని కొందరు, షాహిద్ బాగానే చేశాడని మరికొందరు ట్వీట్లు, పోస్టులు చేశారు. ప్రేక్షకుల చర్చను పక్కన పెడితే... ప్రభాస్‌కు ‘కబీర్ సింగ్’ టీజర్, అందులో షాహిద్ కపూర్ యాక్టింగ్ నచ్చాయి. హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ ద్వారా ఈ సంగతి బయటకు వచ్చింది. ఆయన ‘సాహో’కి పని చేస్తున్నారు. ప్రభాస్‌కి హెయిర్ స్టయిలింగ్ చేస్తున్నారు. ‘కబీర్ సింగ్’ టీజర్ విడుదలైనప్పుడు ఆలిమ్ హకీమ్ ‘సాహో’ సెట్స్‌లో ఉన్నారు. అప్పుడే ప్రభాస్ టీజర్ చూశారు. హీరోతో పాటు మిగతా యూనిట్ మెంబర్స్‌కీ టీజర్ నచ్చింది. ఈ రియాక్షన్ చూసి షాహిద్‌కి ఫోన్ చేశారు ఆలిమ్ హకీమ్. ‘‘కబీర్ సింగ్ టీజర్ బావుంది. ఒరిజినల్ కంటే బావుంది. కబీర్ సింగ్‌గా మీ లుక్, యాక్టింగ్ బావున్నాయి’’ అని ఫోనులో షాహిద్‌తో ప్రభాస్ మాట్లాడారట! ఇద్దరూ ఏడు నిమిషాలు మాట్లాడుకున్నారని ఆలిమ్ హకీమ్ తెలిపాడు.