పవన్ వాళ్లకు నిద్రలేకుండా చేశాడు
on Aug 29, 2016
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించిన తీరుపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ప్రత్యేక హోదాకు పవన్ రాకతో ఊపు వచ్చిందని కొందరు..అనవసరంగా తొందర పడ్డారని మరికొందరు..ఏం చేయాలో మాకు తెలుసునని ఇంకొందరు ఇలా తలోక మాట మాట్లాడుతున్నారు.
తాజాగా ఆయనకు మద్ధతుగా నిలిచాడు సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. పవన్ యాక్టర్ మాత్రమే కాదు..మంచి మనిషి..ఫిలాంత్రఫిస్ట్..రాజకీయ నాయకుడు..ఒక పవర్ ఫుల్ లీడర్. ఆయన ఎంతో స్పూర్తిని నింపే ప్రసంగం చేశారన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు..ఎమ్మెల్యేలకు పవన్ నిద్ర లేకుండా చేశాడని అనుకుంటున్నా..తెలుగు రాష్ట్రాలకు రానున్నవన్నీ మంచి రోజులేనని ట్వీట్ చేశాడు.