భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్
on Jul 26, 2021
మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభమైంది.
ఈ మూవీలో పవన్ 'భీమ్లా నాయక్' అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా పవన్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ 'భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ' అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఖాకీ దుస్తుల్లో పవన్ లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.
Also Read