ఆగస్ట్ 15న పవర్ స్టార్ అభిమానులకు పండగే
on Aug 5, 2017

సంచలనానికి మారుపేరు అంటే... ప్రస్తుతంపవర్ స్టారే. ఓ వైపు హీరోగా, మరో వైపు జనసేన అధినేతగా.. ఆయన షెడ్యూల్ చాలా బిజీ. దాంతో సినీ అభిమానుల దృష్టి, మరో వైపు రాజకీయ నేపథ్యంలోని వారి దృష్టి పవన్ పైనే. ఆయన నుంచి ఎలాంటి స్టేట్మెంట్ వచ్చినా అది ప్రస్తుతం సన్సేషనే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తిస్తాయి రాజకీయ నేపథ్యం ఉంటుందని ఫిలింనగర్ టాక్. దాంతో... ఈ సినిమాపై అన్ని వర్గాలవారూ ఆసక్తి నెలకొంది.
పవన్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. వరస పరాజయాలతో ఉన్న పవర్ స్టార్ ని ‘జల్సా’ చిత్రం హిట్ ట్రాక్ మీద ఎక్కిస్తే... తెలుగు సినిమా స్టామినాను వంద కోట్లకు చేర్చిన సినిమా ‘అత్తారింటికి దారేది’. ఈ రెండూ వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలే కావడం విశేషం. దాంతో ప్రస్తుతం ఈ మూడో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఇంతకీ ఈ సినిమా పేరేంటి? కథా నేపథ్యం ఏంటి? అనేవి ప్రస్తుతం అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు. అందుకే... వారి ఆతృతను దృష్టిలో పెట్టుకుని ఈ ఆగస్ట్ 15న ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్ చూస్తే... సినిమా నేపథ్యం కూడా దాదాపు అర్థమైపోతుందని వేరే చెప్పాలా? పవర్ స్టార్ అభిమానులకు ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూసే. ఏమంటారు?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



