తనతో నటించిన ఫీలింగే పవన్ కళ్యాణ్ తో ఉంది.. లక్ష్మీరాయ్
on Oct 5, 2015

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "సర్దార్ గబ్బర్ సింగ్" లోని ఓ ఐటెంసాంగ్లో బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ లో మలైకా అరోరా చేసిన కెవ్వుకేక పాటకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పాటలో ఐటెంసాంగ్లో నటిస్తున్న లక్ష్మీరాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తుంది. ఇప్పటికే ఈ భామ పవన్ తో తీసుకున్న సెల్ఫీలను ట్వీట్టర్లో పోస్ట్ చేయడంతో వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడితో ఆగకుండా పవన్ ను తన పొగడ్తలతో ముంచెత్తుతోంది. పవర్ స్టార్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ అంటూ.. 'పవన్ లాంటి గొప్ప మానవతా వాదిని డౌన్ టు ఎర్త్ ఉండే స్టార్ ని ఇంతవరకూ చూడలేదని చెప్పుకొస్తుంది ఈ హాట్ బ్యూటీ. అంతేకాదు పవన్ ను కోలీవుడ్ స్టార్ అజిత్ పోల్చి.. తాను కోలీవుడ్ లో అజిత్ తో కలిసి నటించినప్పుడు ఎలా ఫీలయిందో ఇప్పుడు పవన్ తో నటించినప్పుడు కూడా అలాగే ఉందట. మొత్తానికి అమ్మడు పవన్ ను బానే పొగుడుతున్నా తన పొగడ్తలకు ఫలితం ఉంటుందో లేదో చూద్దాం..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



