English | Telugu

హమ్మయ్య పద్మావత్ రిలీజవుతోంది..!!

on Jan 7, 2018

క్రీశ. 12వ శతాబ్ధానికి చెందిన చిత్తోడ్‌గఢ్ మహారాణి పద్మావతి జీవిత కథతో విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం పద్మావతి.. దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే తమ రాణికధను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ.. రాజ్‌పుత్ కర్ణీసేన కార్యకర్తలు షూటింగ్ టైం నుంచి ఈ సినిమాకి అడ్డుతగులుతూనే ఉన్నారు. ఒక దశలో దర్శకుడు భన్సాలీపై దాడికి పాల్పడ్డారు. అయినా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి భన్సాలీ సినిమాను పూర్తిచేశారు.

అయితే రాజ్‌పుత్‌లు విడుదలకు అడ్డుపడుతూ వచ్చారు. ఈ సినిమా విడుదలైతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఉత్తరప్రదేశ్-రాజస్థాన్-మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతూ సినిమా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎట్టకేలకు చరిత్రకారుల కమిటీ, సెన్సార్ సభ్యులు పద్మావతి సినిమా పేరును పద్మావత్‌గా మార్చడంతో పాటు మరికొన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఆ సినిమా విడుదలకు అడ్డు తొలగింది. ఈ మార్పులకు పద్మావత్ నిర్మాతలు అంగీకరించడంతో సెన్సార్ బోర్డు యూ బై ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పద్మావత్‌ను ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here