English | Telugu

బ్రిటన్‌కు పాకిన పద్మావతి సెగలు

on Nov 26, 2017

రాజస్థాన్‌కు చెందిన మహారాణి పద్మావతి జీవిత కథతో బాలీవుడ్ విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమా పద్మావతి.. దీపికా పదుకొణే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని డిసెంబర్ 1న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. తమ రాణికథను వక్రీకరించి సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ షూటింగ్ సమయంలోనే రాజ్‌పుత్ కర్ణీసేన కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భనాల్సీపైనా దాడికి పాల్పడ్డారు.

ఆందోళనలను, నిరసనలను, బెదిరింపులను తట్టుకొని భన్సాలీ సినిమాను పూర్తి చేశారు. అయితే సెన్సార్‌కు వెళ్లిన పద్మావతిని సీబీఎఫ్‌సీ తిప్పి పంపడంతో భారత్‌లో విడుదల ఆగిపోయింది. కానీ ఈ సినిమాను బ్రిటన్‌లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అందుకు తగినట్లుగానే బ్రిటన్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ గ్రీన్ సిగ్నల్ "12ఎ"ఇచ్చింది. దీంతో లండన్‌లోనూ ఆందోళనకు సిద్దమయ్యారు రాజ్‌పుత్‌లు. బీబీఎఫ్‌సీ క్లియరెన్స్ సర్టిఫికేషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసిస్తై బ్రిటన్ పార్లమెంట్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే సర్టిఫికేషన్ విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని బీబీఎఫ్‌సీ పేర్కొంది.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here