సుకుమార్ దెబ్బకి ఎన్టీఆర్ పడిపోయాడు
on Aug 3, 2015
.jpg)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెగ ఇంప్రెస్స్ చేస్తున్నాడట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సీన్ల చిత్రీకరణలో సుకుమార్ టాలెంట్ చూసి ఎన్టీఆర్ ఫ్లాట్ అయిపోయాడట. ఒక్కో సీన్ని వివిధ యంగీల్స్ లో చిత్రకరిస్తూ, ఎన్టీఆర్ ని ఫుల్ గ్లామరస్ గా చూపిస్తున్నాడట.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందు ఎన్టీఆర్, సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయని, స్క్రిప్ట్ విషయం ఈ ఇద్దరకి అసలు పడడం లేదని వార్తలు వచ్చాయి. కానీ షూటింగ్ మొదలయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎన్టీఆర్ లుక్ దగ్గర నుంచి స్క్రిప్ట్ లో మార్పులు వరకు సుకుమార్ తన మార్క్ తో యంగ్ టైగర్ ని ప్రతి రోజు ఇంప్రెస్స్ చేస్తున్నాడట.
ఇప్పుడు ఎన్టీఆర్ ని ఏవరు పలకరించిన సుకుమార్ గురించే చెబుతున్నాడట. అతను జీనియస్, వర్క్ స్టైల్ సూపర్ గా వుందని తెగ పోగిడేస్తున్నాడట. ఈ సినిమా మెజారిటీ చిత్రీకరణ విదేశాలలోనే జరగబోతుంది. అయితే సెప్టెంబర్ నుంచి కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



