పవన్, మహేశ్ లను టార్గెట్ చేసిన నోరా
on Oct 19, 2015

ఒకప్పుడు టాలీవుడ్ లో ఐటెం క్వీన్ గా కొన్ని రోజులు తన హవా చాటింది ముమైత్ ఖాన్. అయితే ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి టాలీవుడ్ ఐటెం క్వీన్ గా ఫుల్ జోష్ మీద ఉంది. గత ఏడాదే ఈ భామ ఇండస్ట్రీకి పరిచయమైనా అప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే టెంపర్ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ఇట్టాగా రెచ్చిపోదాం అంటూ రెచ్చిపోయి తన అందాలను ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత ఏకంగా బాహుబలి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. తర్వాత కిక్2 లోనూ రవితేజ పక్కన కదం తొక్కింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సరసన షేర్ లోనూ పూరీ డైరెక్షన్ లో లోఫర్ లో చేస్తూ వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. అయితే ఇంతమంది హీరోల పక్కన చిందేసే ఛాన్స్ వచ్చినా అమ్మడికి మాత్రం ఇద్దరి హీరోల పక్కన నచించాలని కోరికగా ఉందట. అదేవరనుకుంటున్నారా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ హీరోల పక్కన చేయాలన్నది నోరా టార్గెట్ అట. మరి ఈ హీరోలు నోరాకి ఆ ఛాన్స్ ఇస్తారో లేదో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



