దుబాయ్ వీధుల్లో నితిన్-కీర్తి విహారం!
on Nov 26, 2020
నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. మూడు రోజుల క్రితం భార్య షాలినితో కలిసి దుబాయ్‌కు బయలుదేరి వెళ్లాడు నితిన్. ప్రస్తుతం అక్కడి రోడ్లపై కొన్ని సీన్లు తీస్తున్నారు. గురువారం నితిన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ఫొటో షేర్ చేశాడు. అందులో చైర్‌లో కూర్చొని కళ్లు మూసుకొని, ముఖంపై క్లాత్ పెట్టుకొని కీర్తి రిలాక్స్ అవుతుంటే, చడీచప్పుడు లేకుండా ఆమె వెనుక నిల్చొని ఫొటో దిగారు నితిన్, వెంకీ. ఆ ఫొటోకు, "Between the shot @KeerthyOfficial relaxing . While we are sweating" అనే క్యాప్షన్ జోడించాడు నితిన్.
కాగా అక్కడి సెట్స్ నుంచి అనధికారికంగా మరికొన్ని పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వాటిలో రోడ్డు పక్కన నితిన్, కీర్తి నిల్చొని ఉన్న ఫొటో ఒకటి ఉంది. కీర్తి టీ షర్ట్, జీన్స్ ధరించి, ఆగివున్న మోపెడ్‌పై ఉండగా, నితిన్ ఓ షోల్డర్ బ్యాగ్ పట్టుకొని, క్యాజువల్ డ్రస్‌లో ఉన్నాడు. ఆ పిక్చర్‌లో ఇద్దరూ చూడచక్కని జోడీగా కనిపిస్తున్నారు.
'రంగ్ దే' టీజర్ వచ్చినప్పట్నుంచీ ఈ సినిమాపై బజ్ పెరుగుతూ వస్తోంది. 'భీష్మ' మూవీతో హిట్ కొట్టిన నితిన్ మరింత ఉత్సాహంతో ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 2021 సంక్రాంతికి 'రంగ్ దే'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
