హీరో నితిన్ టీమ్‌ని అరెస్ట్ చేశారా..
on Jul 24, 2017

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశీయులపై ఆంక్షలు మరీ ఎక్కువైపోయాయి. ఇమ్మిగ్రేషన్, తనిఖీలు ఇలా అన్ని చోట్లా ఇతర దేశస్థులను వేధిస్తున్నారు అక్కడి అధికారులు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఎయిర్‌పోర్టుల్లో అవమానాలు పొందారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అండ్ టీమ్ చేరినట్లు టాలీవుడ్ టాక్. నితిన్, హను రాఘవపూడి కాంభినేషన్‌లో వస్తున్న లై మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరిగింది. షూటింగ్‌లో భాగంగా ఓ సీన్ కోసం బోలెడు డమ్మీ గన్స్ వాడారట. అయితే సహజత్వానికి దగ్గరగా ఉంటుందనో..మరే కారణమో కానీ ఓ ఒరిజినల్ గన్ కూడా వాడారట. అదే సమయంలో షూటింగ్ స్పాట్‌కి వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా..ఒరిజనల్ గన్ మేటర్ బయటకు వచ్చింది. దీంతో హీరో నితిన్‌తో సహా యూనిట్ మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల ప్రశ్నలు వేసి చివరకు వదిలేశారట. అయితే ఆ సమయంలో యూనిట్‌లో కొంతమందికి హార్ట్ బీట్ 150 స్పీడుతో కొట్టుకుందట..ఎందుకంటే అక్కడ ఉంది అమెరికా పోలీసులు కదా..? మేటర్ అటు ఇటైతే తమ గతేంటి అని వారి ఉద్దేశ్యం కాబోలు. ఎట్టకేలకు పోలీసులు రిలీజ్ చేయడంతో హమ్మయ్య అనుకున్నారట. ఇప్పటికే టీజర్‌తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



