English | Telugu

మూడు సినిమాల‌తో యువ హీరో!!

on Jan 9, 2019


 

లాస్ట్ హీయ‌ర్  కిరాక్ పార్టీ సినిమాతో వ‌చ్చాడు. అది అంతాగా ఆడ‌లేదు. ప్ర‌స్తుతం `ముద్ర` సినిమాలో న‌టిస్తున్నాడు.ఈ సినిమా కూడా రీమేకే కావ‌డం విశేషం. ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ద‌మైంది. ఇక ఈ సినిమాతో పాటు నిఖిల్ `శ్వాస‌` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. కొత్త డైరెక్ట‌ర్ కిష‌న్ క‌ట్టా ఈ సినిమాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలే కాకుండా మ‌రి కొన్ని ప్రాజెక్టుల‌కు కూడా సైన్ చేశాడ‌ట ఈ హీరో. అంతేకాకుండా ఈ సంవ‌త్స‌రం మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాన‌ని రేప‌టి నుండి కొత్త సినిమాల వివ‌రాల‌ను అలాగే ముద్ర రిలీజ్ డేట్ ను కూడా ప్ర‌క‌టిస్తాన‌ని నిఖిల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. మ‌రి ఆ మూడు సినిమాల‌తో హ్యాట్రిక్ కొట్టి నిఖిల్ ఈ సంవ‌త్స‌రాన్ని మెమ‌ర‌బుల్ ఇయ‌ర్ గా మార్చుకుంటాడో లేదో చూడాలి.


Cinema GalleriesLatest News


Video-Gossips