నిహారిక vs నిఖిల్!
on Feb 5, 2019
నిఖిల్, లావణ్యా త్రిపాఠీ జంటగా నటిస్తున్న సినిమా 'అర్జున్ సురవరం'. అదేంటి... ఈ సినిమా టైటిల్ 'ముద్ర' కదా!? అనుకుంటున్నారా? అవును... టైటిల్ అదే! 'ముద్ర' టైటిల్‌తో జగపతిబాబు సినిమా రావడంతో నిఖిల్ సినిమా టైటిల్ మార్చారు. 'అర్జున్ సురవరం' అని పెట్టారు. తమిళ హిట్ 'కణితన్' రీమేక్ ఇది. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ట్విస్ట్ ఏంటంటే... అదే రోజున మెగా డాటర్ నిహారిక నటించిన 'సూర్యకాంతం' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో రెండు సినిమాలు ఒకే రోజు వస్తుండటంతో పోటీ తప్పదన్నమాట! నిహారిక సినిమా పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కాగా.. నిఖిల్ సినిమా జర్నలిజం నేపథ్యంలో రూపొందిన థ్రిల్లర్ టైప్ సినిమా. రెండు సినిమాల మధ్య కంపేరిజన్ లేదు. సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు వస్తున్నప్పుడు సమ్మర్ సీజన్లో ఒకే వారంలో రెండు సినిమాలు రావడంలో నష్టమేమీ లేదు. అయితే.. ఈ రెండు సినిమాలు విడుదలైన వారం తరవాత ఏప్రిల్ 5న నాగచైతన్య 'మజిలీ', నాని 'జెర్సీ' సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. అందువల్ల, టాక్ బావున్న సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశముంది.