ఆ సాంగ్ మీద రెహమాన్ గరమ్ గరమ్!
on Apr 9, 2020
యుట్యూబ్లో 24 గంటలుగా 'మసకలీ 2.0' సాంగ్ ట్రెండ్ అవుతుంది. విన్నారా? అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ జంటగా 2009లో వచ్చిన 'ఢిల్లీ-6' మూవీలోని 'మసకలీ' పాటకు రీమిక్స్ ఈ 'మసకలీ 2.0'. తనీష్ బగ్చీ ఈ రీమిక్స్ చేశాడు. అతడిపై మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మంచి పాటను చెడగొట్టాడని తిడుతున్నారు. ఆఖరికి రెహమాన్ కూడా రీమిక్స్ మీద పరోక్షంగా ట్వీట్ చేశారు. దాన్నిబట్టి ఆయన కూడా గరమ్ గరమ్గా ఉన్నారని అర్థమవుతుంది.
"షార్ట్ కట్స్ లేవు... కొన్ని తరాల పాటు పాట నిలిచిపోయేలా 365 రోజుల మేథోమథనంతో 200మందికి పైగా సంగీత దర్శకులు కష్టపడ్డారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సరిగా పాట చేసి ఇచ్చాం. ఒరిజినల్ 'మసకలీ' వినండి" అని పదేళ్ల క్రితం వచ్చిన పాటను రెహమాన్ ట్వీట్ చేశారు. ట్వీట్లో రీమిక్స్ గురించి, తనీష్ బగ్చీ గురించి ఎక్కడ ప్రసావించలేదు. కానీ, ఆయన ఎందుకు ట్వీట్ చేశారనేది అందరికీ అర్థమైంది. అదీ సంగతి!
Also Read