English | Telugu

బన్నీ బాలీవుడ్ మూవీకి రెడీ అవుతున్నాడా?

on Aug 22, 2019

 

జాన్ అబ్రహాం హీరోగా నటించిన 'బాట్లా హౌస్' మూవీ సక్సెస్ పార్టీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ముంబైలో బుధవారం జరిగిన ఈ పార్టీలో ఆ మూవీ డైరెక్టర్ నిఖిల్ అద్వానీతో బన్నీ కలిసున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది బన్నీ బాలీవుడ్ సినిమా చేయనున్నాడనే ప్రచారానికి ఈ సక్సెస్ పార్టీ ఊతమిచ్చింది. ఈ పార్టీకి బన్నీ సింపుల్ వైట్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్‌తో అటెండ్ అయ్యాడు. ఇప్పటికే నిఖిల్ అద్వానీ కథ వినిపించాడనీ, బన్నీ సైతం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన సినిమాలు హిందీలో అనువాదమై జాతీయ ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లలో ప్రసారమవుతూ మంచి రేటింగ్ సాధిస్తున్నాయి. యూట్యూబ్‌లోనూ ఆ సినిమాలకు అత్యధిక సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. దీంతో అతనితో నేరుగా సినిమాలు చెయ్యాలని బాలీవుడ్ డైరెక్టర్స్ భావిస్తున్నారు.

కాగా, బన్నీ ప్రస్తుతం త్రివిక్రం దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న ఈ మూవీలో టబు ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇది తండ్రీ కొడుకుల అనుబంధం చుట్టూ నడిచే కథగా వినిపిస్తోంది. బన్నీ తండ్రిగా మురళీశర్మ నటిస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ ఫిల్మ్ 'ది ఇన్వెన్షన్ ఆఫ్ లయింగ్'ను ఆధారం చేసుకొని ఈ మూవీ స్క్రిప్టును త్రివిక్రం రూపొందించాడనే ప్రచారం ఫిలింనగర్‌లో నడుస్తోంది. అందులో ఎంత నిజముందో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో..' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇప్పటికే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బహుశా దాని తర్వాత అతను బాలీవుడ్‌కు వెళ్లే అవకాశం ఉంది.


Cinema Galleries



Latest News


Video-Gossips