అక్షయ్ హీరో.. రానా విలన్!
on Aug 21, 2019
యస్.యస్. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాల్లో భల్లాలదేవ అనే పవర్ఫుల్ విలన్గా నటించి, ఆకట్టుకున్న రానా దగ్గుబాటి.. ఇప్పుడు మరో సినిమాలో విలన్గా దర్శనమివ్వనున్నాడు. అయితే అది తెలుగు సినిమాలో కాదు, హిందీ సినిమాలో. ఈ ఏడాది బాలీవుడ్లో నిర్మాణమవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటైన 'హౌస్ఫుల్ 4'లో రానా ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్ మెయిన్ హీరోగా నటిస్తుండగా, రితీశ్ దేశ్ముఖ్, బాబీ డియోల్ మరో ఇద్దరు హీరోలుగా నటిస్తున్నారు. అక్షయ్ జోడీగా కృతి సనన్ కనిపించే ఈ మూవీలో పూజా హెగ్డే, కృతి ఖర్బందా మిగతా ఇద్దరు హీరోల సరసన నటిస్తున్నారు.
'హౌస్ఫుల్ 4'కు సంబంధించిన మరో విశేషం.. ఇది రెండు కాలాల్లో జరిగే కథ కావడం. అంటే పునర్జన్మల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ప్రస్తుత కథ లండన్లో జరిగితే, పూర్వజన్మ కథ రాజస్థాన్ నేపథ్యంలో జరుగుతుంది. ఇటీవల అక్షయ్, రానా, మిగతా ప్రధాన నటీనట బృందంపై ఒక ఖవ్వాలీ సాంగ్ చిత్రీకరించారు. సంభాషణల ధోరణిలో సాగే ఈ పాటలో అక్షయ్, రానా ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఒక స్పెషల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు ఫరాద్ సమ్జీ దర్శకుడు. వచ్చే దీపావళికి ఈ సినిమా విడుదలవుతుంది. 'హౌస్ఫుల్ 4'లో ప్రతినాయకుడిగా రానా ఎలా రాణిస్తాడో చూడాలి మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
