English | Telugu

25వ జేమ్స్ బాండ్ మూవీ టైటిల్ ఇదే!

on Aug 21, 2019

 

జేమ్స్ బాండ్ సిరీస్‌లో రానున్న 25వ సినిమాకు అధికారికంగా టైటిల్ ప్రకటించారు. ఆ టైటిల్.. 'నో టైం టు డై'. జేమ్స్ బాండ్ ట్విట్టర్ అకౌంట్ ఈ టైటిల్‌ను రివీల్ చేసింది. వరుసగా ఐదోసారి డేనియల్ క్రెగ్.. జేమ్స్ బాండ్ కేరెక్టర్ చేస్తుండగా, మునుపటి బాండ్ సినిమాల్లో నటించిన రాల్ఫ్ ఫియన్నెస్ (ఎం), లియా సీడౌక్స్, నవోమీ హారిస్ (మనీపెన్నీ), బెన్ విన్‌షా (ఎ), రోరీ కిన్నియర్ (టానర్), జెఫ్రీ రైట్ (ఫెలిక్స్ లీటర్) తమ పాత్రల్ని నిలుపుకున్నారు. కొత్తగా దలి బెన్సల్లా, బిల్లీ మాగ్నుస్సేన్, అనా డి అర్మా, డేవిడ్ డెన్సిక్, లషానా లించ్, రామి మాలెక్.. జేమ్స్ బాండ్ మూవీలో అడుగు పెడుతున్నారు.
'ఇట్' (2017) ఫేం కారీ జోజి ఫుకుంగా డైరెక్ట్ చేస్తున్న 'నో టైం టు డై' మూవీకి నీల్ పర్విస్, రాబర్ట్ వేడ్, స్కాట్ జడ్. బర్న్స్, ఫోబే వాలర్-బ్రిడ్జ్‌తో కలిసి జోజి ఫుకుంగా స్క్రిప్ట్ సమకూరుస్తున్నాడు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి యూనివర్సల్ పిక్చర్స్ సంస్థతో ఇయాన్ ప్రొడక్షన్స్, మెట్రో గోల్డ్‌విన్ మేయర్ స్టూడియోస్ భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. 2020 ఏప్రిల్‌లో 'నో టైం టు డై' మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. మునుపటి బాండ్ మూవీ 'స్పెక్టర్' 2015 నవంబర్ 15న విడుదలై వరల్డ్‌వైడ్‌గా 880.7 మిలియన్ డాలర్లను ఆర్జించింది.
 


Cinema Galleries



Latest News


Video-Gossips