బన్నీ సినిమాకు ముహూర్తం కుదిరింది!!
on Aug 19, 2019
ప్రెజెంట్ బన్నీ , త్రివిక్రమ్ డైరెక్షన్ లో `అల వైకుంఠపురం లో` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం . ఇదిలా ఉంటే బన్నీ , సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఇక ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు ఆగష్టు 22 న ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ కావొచ్చాయట. రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. సుక్కు , బన్నీ కాంబినేషన్ లో గతం లో ఆర్య , ఆర్య -2 చిత్రాలు వచ్చాయి. రెండు సినిమాలకు మంచిపేరొచ్చింది. ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. హీరోయిన్ గా రష్మిక మందన్న నటించే అవకాశాలున్నాయట. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.