గీతా ఆర్ట్స్ నుంచి బయటకొచ్చిన బన్ని!!!
on Sep 25, 2018
బన్ని ఏంటి? గీతా ఆర్ట్స్ నుంచి బయటకు రావడం ఏంటి? అనుకుంటున్నారా? అవును ఇంత కాలం బన్ని తన సొంత సినిమాలకు సంబంధించిన పనులన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీసులోనే చక్కబెట్టుకునేవాడు. అయితే గీతా ఆర్ట్స్ లో వరుసగా చిత్రాలు జరుగుతుండటంతో బన్నీ తనకంటూ ప్రత్యేకంగా జూబ్లిహిల్స్ లో ఒక ఆఫీసు ప్రారంభించాడని తెలుస్తోంది. ఇక నుంచి బన్ని చిత్రాలకు సంబంధించిన కార్యకలాపాలు అన్ని ఆ ఆఫీసులోనే జరుగుతాయి.
అయితే గతంలో అల్లు అర్జున్ సొంతంగా ఒక బేనర్ స్థాపించి కన్నడంలో ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కానున్నాయా? అన్నది మరో వైపు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నాపేరు సూర్య తర్వాత విక్రమ్ తో సినిమా చేస్తున్నాడన్న వార్త వచ్చినా కానీ ఆ కథ విషయంలో సంతృప్తిగా లేని బన్ని దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న బన్నీకి కొత్త ఆఫీసైనా కలిసొస్తుందో లేదో చూడాలి.