దర్శకుణ్ని హీరోని చేస్తోన్న విజయ్ దేవరకొండ!!!
on Sep 17, 2018
నిజంగా ఈ వార్త ఆసక్తికరమైనదే అని చెప్పాలి. `పెళ్లి చూపులు` చిత్రంతో దర్శకుడుగా తరుణ్ భాస్కర్, హీరోగా విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమా చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది. ఏది చేసినా డిఫరెంట్ గా ఉండాలని కోరుకునే విజయ్ దేవరకొండ దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి ...తను ఒక ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేస్తూ నిర్మాత గా ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడట. `గీత గోవిందం` బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరో వైపు వరుసగా చిత్రాలున్నాయి. ఇంత బిజీల ఉంటూ నిర్మాతగా చేయడం అవసరమా? అని కొందరంటున్నా తనకు ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్లిపోయే విజయ్ దేవరకొండ ఎవరి మాట వినకుండా నిర్మాతగా మారుతున్నాడట.
ఇప్పటి కే ఈ చిత్రానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాకు ఓ తమిళ దర్శకుడు పని చేయనున్నాడని సమాచారం. ` పెళ్లి చూపులు` చిత్రంతో ఘన విజయం అందుకుని కొంత గ్యాప్ తీసుకుని `ఈ నగరానికి ఏమైంది` సినిమాను డైరక్ట్ చేశాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా నిరాశ పరచడంతో తన తదుపరి సినిమాల కథ కోసం కసరత్తులు చేస్తున్నాడు. దర్శకుడుగా ఎంతో మంచి భవిష్యత్ ఉన్న తరుణ్ భాస్కర్ ఇలా హీరోగా చేయడం అవసరమా అనేవారు లేకపోలేదు. కానీ తరుణ్ ని హీరోగా చేయమంటూ విజయ్ దేవరకొండ ఫోర్స్ చేస్తున్నాట. చూద్దాం చివరకు ఏమవుతుందో.
Also Read