ENGLISH | TELUGU  

ఈసారి తమిళనాడును టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

on Jul 12, 2018


తన ఫేస్‌బుక్‌ పోస్టులతో బెంబేలెత్తిస్తున్న శ్రీరెడ్డి ఎప్పుడ ఎవరి మీద దాడి చేస్తుందో ఊహించడం కష్టం. అనూహ్యంగా ఈసారి తమిళ దర్శకుడు మురుగదాస్‌ మీద ఓ పోస్టు పడేసింది శ్రీరెడ్డి. ‘అంధగాడు’ డైరక్టరు వెలిగొండ శ్రీనివాస్‌ తనని మురుగదాస్‌కి ఓ హోటల్లో పరిచయం చేశాడనీ... అక్కడ ఆయన తనకి తప్పకుండా సినిమా ఛాన్స్‌ ఇస్తానని మాట ఇచ్చాడనీ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ తనకి ఆ ఛాన్స్ ఇవ్వనే లేదని దెప్పి పొడిచింది. అంతేకాదు, తమిళనాట స్థిరపడిన తెలుగు నటుడు శ్రీకాంత్‌ మీద కూడా మరో పోస్టు పెట్టింది. ఐదేళ్ల క్రితం క్రికెట్‌ లీగ్‌ సందర్భంగా తామిద్దం కలిశామనీ, ఆ సమయంలో తనకి ఓ ఛాన్స్ ఇస్తానంటూ మాట ఇచ్చాడని చెప్పుకొచ్చింది. మరి శ్రీరెడ్డి తాజా ఆరోపణలకు మురుగదాస్‌, శ్రీకాంత్‌లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటిదాకా తెలుగు పరిశ్రమనే టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడ తమిళనాడు మీద దృష్టి సారించడం చూస్తే, త్వరలో కోలీవుడ్‌లో కూడా పలు వివాదాలు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.