అమెరికా రోడ్లపై బిచ్చమెత్తుకున్న బాలీవుడ్ నటుడు
on Jun 15, 2018
బాలీవుడ్ అంతా సంజయ్ దత్ బయోపిక్ 'సంజు' కోసం ఎదురుచూస్తుంది.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. హీరోగా చేసిన 'రణ్ బీర్' నటన, రూపంలో సంజయ్ ని దించేసాడు.. ఈ సినిమాకి రాజ్ కుమార్ హిరాణి దర్శకుడు.. అయితే తాజాగా విడుదలైన 'సంజు' పోస్టర్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.. రణ్బీర్ రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్లో ఒక మేటర్ రాసుంది.. అదేంటంటే 'మాదకద్రవ్యాలకు అలవాటుపడిన సంజయ్, చికిత్స నిమిత్తం అమెరికాలోని రిహాబ్ సెంటర్ వెళ్లారు.. ఒకసారి సంజయ్ అక్కడినుంచి పారిపోయి, తన స్నేహితుడి ఇంటికి వెళ్లడానికి డబ్బుల కోసం అక్కడి రోడ్లపై బిచ్చమెత్తుకున్నాడు'.. ఇది చూసి అందరు షాక్ అవుతున్నారు.. అయితే డైరెక్టర్ ఈ పోస్టర్ విడుదల చేస్తూ.. కొన్ని విషయాలు నమ్మలేని విధంగా ఉంటాయి కానీ ఇది నిజం అంటూ ట్వీట్ చేసారు.