శ్రద్ధాకపూర్ కన్ఫామ్..
on Aug 15, 2017
బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా 'సాహో' లో హీరోయిన్ ఎవరబ్బా అని జట్టుపీక్కుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పటివరకూ ఈ సినిమాలో శ్రద్దా కపూరే హీరోయిన్ అని.. ఆ తరువాత కాదు అని.. శ్రద్దాకపూర్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోతుందని.. ఒకవేళ శ్రద్దాకపూర్ కనుక కుదరకపోతే వేరే హీరోయిన్ కు ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు శ్రద్దాకపూరే ఫిక్స్ అయిపోయింది. కాగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను తెలుగు .. తమిళ .. హిందీ మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు.