'డిస్కో రాజా' రిలీజ్ డేట్ మారింది
on Nov 7, 2019
రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న 'డిస్కో రాజా' మూవీ విడుదల తేదీ మారింది. ఇదివరకు ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా 'డిస్కో రాజా' రిలీజ్ డేట్ జనవరి 24గా ప్రకటించారు దర్శక నిర్మాతలు. జనవరి 26 రవితేజ పుట్టినరోజు. అదే రోజు రిపబ్లిక్ డే అనే విషయం తెలిసిందే. అయితే ఆరోజు ఆదివారం రావడంతో జనవరి 24 శుక్రవారం విడుదల చెయ్యాలని సంకల్పించారు. వి.ఐ. ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. రవితేజ సరసన నాయికలుగా పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నటిస్తున్నారు.
సునీల్, తాన్యా హోప్, వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు చేస్తుండగా, విలన్ రోల్‌ను బాబీ సింహా పోషిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా బాబీ సింహా రోల్‌ను నిర్మాతలు రివీల్ చేశారు. బర్మాసేతు అనే క్రూర విలన్‌గా ఆయన కనిపిస్తాడని స్టిల్‌తో పాటు నిర్మాణ సంస్థ తన అఫిషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడి చేసింది. అందులో కళ్ల జోడు పెట్టుకొని నవ్వుతున్న బాబీసింహా కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ నవంబర్ 18తో ముగియనున్నది. డిసెంబర్ మొదటి వారంలో టీజర్‌ను రిలీజ్ చేస్తారు. సినిమా సైన్స్ ఫిక్షన్ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఉందనీ, అందువల్లే మూవీ విడుదల తేదీని డిసెంబర్ నుంచి జనవరికి జరిపారని సమాచారం. అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.