‘నేనే రాజు...’కథకు ఫస్ట్ అనుకున్న హీరో ఆయనే?
on Aug 9, 2017

టైమ్ బాగోనప్పుడు మనం ఇక్కడకు బయలు దేరినా... మనకంటే వంద అడుగుల ముందు ఉంటుంది దరిద్ర దేవత. పాపం డా.రాజశేఖర్ పరిస్థితి అదే. పాతికేళ్ల క్రితం రాజశేఖర్ సినిమాలకుండే క్రేజే వేరు. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. అంతెందుకు... తన దగ్గరకు వచ్చిన మంచి మంచి అవకాశాలను కూడా స్వయంగా ఆయనే నెట్టేస్తున్నాడంటే... పాపం టైమ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాలకృష్ణ, కె.ఎస్. రవికుమార్ సినిమాకు విలన్ గా రాజశేఖర్ ని అడిగారు. కానీ... ఆయన మాత్రం ‘హేఠ్.. నేనింకా హీరోనే’అంటూ.. మంచి అవకాశాన్ని దూరం చసుకున్నాడు. ఇలాంటి అవకాశాలు ఎన్నో పోగొట్టుకున్నాడు రాజశేఖర్. అంతెందుకు... రేపు రాబోతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కథను తేజా ముందు వినిపించింది రాజశేఖర్ కే. అప్పుడు ఆ సినిమా పేరు ‘అహం’. కథ కూడా నచ్చిందట. కానీ... ఏందుకో పాపం... తేజా వారితో జర్నీ చేయలేకపోయాడు. టైమ్ బాగోపోతే అంతే.. చివరకు ఆ కథ సురేశ్ ప్రొడక్షన్ వాళ్లకు నచ్చడం... రానా హీరోగా ‘నేనే రాజు నేనే మంత్రి’ పేరు తయారవ్వడం కూడా జరిగింది పోయింది. రేపు ఆ సినిమా సూపర్ హిట్ అయితే... రాజశేఖర్ ఎంత బాధ పడాల్సొస్తుందో కదా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



