నేనే రాజు నేనే మంత్రి అసలు టైటిల్ ఏంటో తెలుసా?
on Aug 9, 2017

జీవితం వేరు.. సినిమా వేరు. ఇది చాలామంది చెప్పేమాట. కానీ... ఈ రెండిటికీ పోలికలు చాలానే ఉంటాయి. జీవితం కలర్ ఫుల్ గా ఉంటుంది. సినిమా రంగం కూడా కలర్ ఫుల్ గా ఉంటుంది. జీవితం ఒడిదుడుకుల మయం. సినిమా రంగం కూడా సేమ్ టు సేమ్. అనుకున్నది జరగకపోవడమే జీవితం. సినిమా రంగంలో కూడా అంతే ఊహించింది పొరపాటున కూడా జరగదు. అందుకే... జీవితాన్ని సినిమాతో పోలుస్తుంటారనుకుంట.
దర్శకుడు తేజా తో కాసేపు మాట్లాడితే... ఇలాంటి ఎన్ని విషయాలు చెబుతారో. ఆయన దర్శకత్వం వహించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఈ 11న విడుదల కానుంది. ఈ సినిమా గురించి ఆయన చెబుతూ... ఆసక్తికరమైన విషయాలు కొన్ని చెప్పారు. అసలు ఈ కథకు ఆయన మొదట పెట్టుకున్న పేరు ఏంటో తెలుసా? ‘అహం’. టైటిల్ అదిరింది కదూ. ముందు అనుకున్నది ఏదీ సినిమా రంగంలో జరగదు కదా. అందుకే.. ఆ సినిమా పేరు ‘నేనే రాజు నేనే మంత్రి’గా మారిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



