సాయి తేజ్‌కి సోలో హీరోయిన్ కాదు గురూ
on Feb 19, 2020
సాయి తేజ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'సోలో బతుకే సో బెటర్'. కానీ, ఇది సోలో హీరోయిన్ సినిమా కాదు గురూ! ఇందులో నభా నటేష్ ఒక్కరే హీరోయిన్, ఆమె ఒక్కరే అందమైన అమ్మాయి అనుకుంటే పొరపాటే. నభాతో పాటు చాలామంది అందమైన అమ్మాయిలు సినిమాలో ఉన్నారట. అందులో నజియా డేవిడ్సన్ ఒకరు. ఇంతకుముందు ఈ అమ్మాయి అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను'లో కూడా నటించింది. అందులో అఖిల్ గాళ్‌ఫ్రెండ్‌గా కనిపించింది. ఇప్పుడు 'సోలో బతుకే సో బెటర్'లో సాయి తేజ్ గాళ్‌ఫ్రెండ్ కావాలని ప్రయత్నించే అమ్మాయిగా కనిపిస్తారని టాక్. హీరోకి లైన్ వేసే అమ్మాయిగా నజియా కనిపిస్తారట. అమ్మాయిలు అంటే పడని ఒక అబ్బాయి, ప్రేమలో పడకూడదని ప్రతిజ్ఞలు చేయించే ఒక అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డాడని కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. కొత్త దర్శకుడు సుబ్బు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్ విడుదలైంది. మే 1న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.