తారల్లో నయనతార గ్రేట్.. అంతే!
on Apr 4, 2020
సౌతిండియన్ స్టార్ హీరోయిన్లు అందరిలో నయనతార గ్రేట్... అంతే! ఎందుకంటే... కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. దక్షిణాది సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కి ఆమె 20 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో నయనతార స్టార్. అందుకని, భాషలకు అతీతంగా ఫెప్సీకి ఇచ్చి ఉండవచ్చు.
కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే కథానాయికులు దక్షిణాదిలో చాలామంది ఉన్నారు. మైక్ ముందుకొస్తే చాలు... ప్రేక్షకులే తమ దేవుళ్లు, తమ జీవితం అన్నట్టు మాట్లాడతారు. కానీ, ప్రేక్షకులకు కష్టాలు వచ్చినప్పుడు కనీసం పది వేలు సాయం చేయడానికి చేతులు బయటకు రావు. స్టార్ హీరోయిన్ల కంటే ప్రణీత, లావణ్యా త్రిపాఠి బెటర్. తమ వంతుగా లక్ష రూపాయల చొప్పున సాయం చేశారు. యాంకర్ రష్మి మూగ జీవాలకు ఆహారం అందిస్తున్నారు. మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. స్టార్ హీరోయిన్లు మాటలు చెబుతున్నారు కానీ రూపాయి ఇవ్వడం లేదు.
Also Read