నాని సైన్స్ ఫిక్షన్ సినిమాకి బ్రేకులు
on May 26, 2020
ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలకు కరోనా బ్రేకులు వేసింది. లాక్డౌన్ వలన షూటింగులకు బ్రేకులు పడి సినిమాలు ఆగాయి. అయితే, ఇంకా సెట్స్ మీదకు వెళ్లని సినిమాలకు సైతం కరోనా బ్రేకులు వేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీయాలన్న నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ముందు వెనుక ఆలోచిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రకటించిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. నాని, ఈ ప్రొడక్షన్ హౌస్ కాంబినేషన్లో 'జెర్సీ' సినిమా వచ్చింది. దానికి మంచి పేరు వచ్చింది. అది స్పోర్ట్స్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఈసారి సైన్స్ ఫిక్షన్ స్టోరీతో భారీ లెవెల్ సినిమా ప్లాన్ చేశారు.
కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ లెక్కలు మారుతున్నాయి. థియేటర్లకు ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ఓపెన్ అయితే ప్రేక్షకులు వస్తారా? కలెక్షన్స్ ఎలా ఉంటాయి? ఇలా సవాలక్ష ప్రశ్నల మధ్య ఇండస్ట్రీలో ఒక విధమైన అనిశ్చితి నెలకొంది. ఇటువంటి సమయంలో భారీ బడ్జెట్ సినిమా ఎందుకని 'శ్యామ్ సింగ రాయ్'ని తాత్కాలికంగా పక్కన పెట్టారట. ఈ సినిమా కంటే ముందు వేరే సినిమాలు చేయాలని అటు నాని, ఇటు నిర్మాతలు అనుకుంటున్నారట.