మీసం తీసేసిన నాని!
on Jul 27, 2021
వరుసగా ఆసక్తికర చిత్రాలు చేస్తూ వస్తున్న నాని, ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని పూర్తిచేసే పనిలో పడ్డాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ తీసుకున్న అతను వాక్సిన్ వేయించుకొని పెండింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తిచేయడానికి సెట్స్‌కు తిరిగొచ్చాడు. మొదట, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' షూటింగ్‌ను సోమవారం కంప్లీట్ చేశాడు. పునర్జన్మ నేపథ్యంలో నడిచే కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు.
ఆ షూటింగ్ తర్వాత, ఓ వీడియోను షేర్ చేశాడు నాని. దానికి, "మనకి వచ్చింది ఒక్కటే.. సినిమా. కొత్త ప్రయాణంలో.." అని క్యాప్షన్ జోడించాడు. 'శ్యామ్ సింగ రాయ్' కోసం పైకి మెలితిప్పిన మీసంతో కనిపించిన అతను, దాన్ని పూర్తిగా తీసేసి వీడియోలో కనిపించాడు. ఈ మీసంలేని లుక్ 'అంటే సుందరానికి' కోసం! ఈ లుక్‌లో నాని సరికొత్తగా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. నాని కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న 'అంటే సుందరానికి' సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాతో ఫహద్ ఫాజిల్ భార్య, మలయాళం తార నజ్రియా నజీమ్ టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. నాని వీడియోను డైరెక్టర్ కూడా షేర్ చేసి, “#AnteSundaraniki Modalaindhi. Game on. (sic)” అని రాసుకొచ్చాడు. ఈ సినిమా కథ ఏమిటనేది వెల్లడి కాకపోయినా, రొమాంటిక్ కామెడీగా రూపొందుతోందని తెలుస్తోంది.
Also Read