'శ్యామ్ సింగ రాయ్'.. సోలో సాంగ్ టైమ్..
on Nov 22, 2020
'శ్యామ్ సింగ రాయ్'.. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పిరియడ్ డ్రామా ఇది. పునర్జన్మల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నానికి జోడీగా సాయిపల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్నారు.
కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోందని సమాచారం. అక్కడ ప్రత్యేకంగా వేసిన వింటేజ్ కోల్కత్తా సెట్లో నానిపై సోలో సాంగ్ షూట్ జరుగుతోందట. మరో నాలుగు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. ఈ పాటయ్యాక ఇంటర్వెల్ సీక్వెన్స్‌ని కూడా అక్కడే ప్లాన్ చేశారట. సినిమాలో ఈ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు.
కాగా శ్యామ్ సింగ రాయ్ 2021 ద్వితీయార్ధంలో థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read