నాగ్ భయం నిజమైంది
on Nov 13, 2015
.jpg)
ఎన్నో అంచనాల మధ్య అఖిల్ సినిమా విడుదలైంది. దీపావళి బాణసంచాలా ఢమఢమలాడేస్తుందనుకొంటే.. తొలిరోజే తుస్సుమంది. అఖిల్ సినిమా చూసి స్వయంగా అక్కినేని అభిమానులే పెదవి విరుస్తున్నారు. ఇక నాగార్జున అయితే చెప్పక్కర్లెద్దు. ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం ఉదయం నాగచైతన్యతో కలసి అఖిల్ సినిమా చూసిన నాగ్... నిరాశతో వెనుదిరిగాడు.
అఖిల్ సినిమాపై నాగ్‌కి ముందు నుంచీ అపనమ్మకమే. ఈ సినిమా రషెష్ చూసి... నాగ్ పెదవి విరవడం, విజువల్ ఎఫెక్స్ బాగోలేవని చెప్పడం, కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయమని ఆదేశించడం.. జరిగాయి. అయితే సీన్స్‌ని రీషూట్ చేయడం నా వల్ల కాదని వినాయక్, నితిన్ చేతులెత్తేయడంతో, విఎఫ్ ఎక్స్ మార్పులతో సరిపెట్టుకొన్నారు. అలా మార్చిన విజువల్స్ కూడా గొప్పగా లేకపోవడంతో ఈ సినిమా క్లైమాక్స్ తేలిపోయింది.
సినిమా ఇలానే జనాల్లోకి వెళ్తే.. ఫ్లాప్ అవ్వడం ఖాయమని నాగ్ భయం. అందుకే సినిమా ఆలస్యమైనా ఫర్వాలేదు. రీషూట్ జరపాల్సిందే అని నాగ్ పట్టుబట్టినా మిగిలినవాళ్లు వినలేదు. ఈ సినిమాపై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో విడుదల చేసేశారు. ఆ ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. నాగ్ చెప్పినట్టు కొన్ని సీన్స్ రీషూట్ చేసి, స్ర్కీన్ ప్లే ఆర్డర్‌ని కాస్త మార్చినా ఈ సినిమా కనీసం యావరేజ్ మార్క్ దగ్గర ఆగేది. ఏం చేస్తాం..?? ఇట్స్ టూ లేట్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



