టీజర్ రివ్యూ: యుద్ధం శరణం
on Aug 1, 2017

రారండోయ్ వేడుక చూద్దామ్ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న మూవీ యుద్ధం శరణం గచ్ఛామి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తనకు బాగా సెట్ అయ్యే ప్రేమ కథలతో తనకు తిరుగులేదని నిరూపించిన నాగచైతన్యకు మాస్ కథలపై పిచ్చి మాత్రం తగ్గడం లేదు..కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌లో చైతూ దుమ్ములేపినట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే టీజర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సీనియర్ హీరో శ్రీకాంత్ ఫస్ట్ టైం నెగిటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటిస్తున్నాడు. అలాగే మురళీశర్మ-రేవతీల పాత్రలు హైలెట్‌గా నిలుస్తాయట. ఈ మూవీలో చైతూకి జతగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



