నాగ్ మొదలెట్టాడు..ఇక ఆగదు
on Aug 20, 2015
.jpg)
‘మనం’ సినిమా తర్వాత కింగ్ నాగ్ సొంత బేనర్లో కొత్తబ్బాయి కళ్యాణ్ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ మొదలుపెట్టాడు. చకచకా షూటింగ్ కూడా చేశాడు. కానీ ఏమైందో ఏమో.. ఆ సినిమా సడెన్ గా వార్తల్లో లేకుండా పోయింది. ఔట్ పుట్ మీద అసంతృప్తి తో నాగ్ ఆ సినిమా ఆపేసాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ పని పూర్తి చేసే పనిలో పడ్డాడు నాగ్. ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్ స్క్రిప్టు మరింత బాగా తీర్చిదిద్ది నాగ్ ముందుకొచ్చాడు. దీంతో మళ్ళీ నాగ్ ఈ సినిమా మొదలెట్టాడు. ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ సినిమా పూర్తయ్యేవరకు నాన్ స్టాప్ గా సాగుతుందని ట్విట్టర్ లో ప్రకటించాడు నాగ్. అంటే ఇప్పుడు నాగ్ స్క్రిప్టు విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నట్లే అన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



