నా పేరు సూర్య ట్రైలర్ రివ్యూ
on Apr 28, 2018
కోపం మన బలం.. మన ఎమోషన్.. చాలాసార్లు మన కోపమే మన శత్రువు కూడా. అలాంటి కోపం, మొండితనం ఉన్న ఓ సైనికుడి కథ.. `నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా`. అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రమిది. మే 4న విడుదల అవుతోంది. ఇప్పుడు థియేటరికల్ ట్రైలర్‌ని వదిలారు. ఈ ట్రైలర్ మొత్తం బన్నీ కోపం, ఎమోషన్, యాక్షన్ చూపించడానికే కేటాయించాడు దర్శకుడు. యాక్షన్ పీక్స్‌లో ఉంది. `క్యారెక్టర్ వదులుకోవడమంటే ప్రాణాలు వదులుకోవడమే, చావురాక ముందు చచ్చిపోవడమే` అనే స్వభావం ఉన్న పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. బొమన్ ఇరానీ, అర్జున్, శరత్ కుమార్, నదియా.. ఇలా బీభత్సమైన ప్యాడింగ్ ఉన్న సినిమా ఇది. అర్జున్ తరవాత.. ఎక్కవ సేపు కెమెరా ఫోకస్ అయ్యింది... సీనియర్ అర్జున్పైనే. అల్లు అర్జున్ అంటే డాన్స్. అది లేకపోతే ట్రైలర్ ఎలా పూర్తవుతుంది. అందుకే చిన్న మూమెంట్‌ని కూడా ఇందులో మిక్స్ చేశారు. విజువల్స్, రీ రికార్డింగ్, క్వాలిటీ, యాక్షన్ మూమెంట్స్ ఇవన్నీ పీక్స్‌లో ఉన్నాయి. ఏ రకంగా చూసినా హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ నడిచే సినిమా ఇదని అర్థమైపోతూనే ఉంది. సూర్య క్యారెక్టర్ పండితే... ఈ సమ్మర్లో మరో హిట్ చూసేసినట్టే.