సల్మాన్ కంటనీరు..శిక్ష చెప్పలేదు
on May 6, 2015
.jpg)
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ను కోర్ట్ దోషిగా తేల్చింది. ముంబై సెషన్స్ జడ్జి దేశ్పాండే తీర్పు వెలువడిస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ దిగాలుగా నిలుచుని వుండిపోయాడు. జడ్జి నోటి వెంట అతను దోషి అనే మాట వినగానే సల్మాన్ ఖాన్ కళ్ళలో నీళ్ళుతిరిగాయి. మరోవైపు తీర్పు కోసం సల్మాన్ వెంట వచ్చిన అతని సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. సల్మాన్ను దోషిగా తేల్చిన వె౦టనే సల్మాన్ సోదరులు ఆర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్లు కోర్టు నుంచి వెళ్ళిపోతూ కంటతడి పెట్టుకున్నారు. అయితే సల్మాన్ ను దోషిగా తేల్చిన కోర్ట్ అతనికి ఏ శిక్ష వేస్తుందనేది మాత్రం ఇంకా చెప్పలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



