కన్నడ హీరో ధృవ్ హఠాన్మరణం
on Aug 1, 2017

కన్నడ హీరో ధృవ్ అంటే తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియక పోవచ్చు గాని, కిచ్చ సుదీప్ నేతృత్వంలోని కర్ణాటక బుల్ డోజర్స్ క్రికెట్ టీం లో ప్రధాన ప్లేయర్ గా పరిచయస్తుడే. విషాదకర విషయం ఏంటంటే, ఈ ప్రముఖ నటుడు హఠాత్మరణం చెందాడు. శనివారం ఇంట్లో ఉన్నట్టుండి పడిపోయిన ధృవ్ ని ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే, ధృవ్ కి కుటుంబ పరమయిన, ఆర్ధిక పరమయిన సమస్యలు ఉన్నాయని తెలిసింది. అతడు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసాడని వినికిడి. నిన్న అర్ధరాత్రి గుండెపోటు, అవయవాల వైఫల్యం తో పరిస్థితులు చేయి దాటి, మంగళవారం ఉదయం 3 గంటలకి మృతి చెందారు. ఎమ్మెస్ రామయ్య హాస్పిటల్ లో పోస్ట్ మార్టం జరుగుతుంది. మూగ, చెవుడు లాంటి సమస్యలు ఉన్నా... అవేవి అడ్డుకాదని నిరూపిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ధృవ్ హఠాత్మరణం కన్నడ ఇండస్ట్రీ కి పెద్ద లోటని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



