ఎమ్.ఎస్.నారాయణ గిన్నిస్ రికార్డ్
on Jul 25, 2014
17 సంవత్సరాలలో 700 వందల సినిమాలలో నటించిన ఎమ్.ఎస్.నారాయణ త్వరలో గిన్నిస్ రికార్డుల్లో స్థానం దక్కించుకోనున్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు నటించినందుకు ఆయన ఈ గౌరవాన్ని పొందనున్నారు.
1997 నుంచి సినిమాల్లో నటిస్తున్న ఆయన ఎంపీ మెంటే పద్మనాభం ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రచయిత కావాలని వచ్చిన ఎం.ఎస్ హాస్య నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో స్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. అప్పటి నుంచి నిర్విరామంగా సినిమాల్లో నటిస్తున్న ఆయన 700 సినిమాలు పూర్తిచేసుకుంటున్నారు. ఇన్ని ఏళ్లలో ఆయన నటించిన సినిమాల్లో దూకుడు చిత్రానికి ఎక్కువ పేరు వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం గోవిందుడు అందరి వాడే చిత్రంతో పాటు 15 చిత్రాల్లో నటిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇదిలా వుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో సినీ పరిశ్రమ రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి చేయటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
