దర్శకుడుగా మారుతున్న సూపర్ స్టార్!!!
on Apr 24, 2019
తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులైన నటుడు, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గత నలభై ఏళ్లుగా తన నటనతో అలరిస్తూ వస్తున్నాడు. పరిపూర్ణ నటుడుగా పేరు తెచ్చుకున్న ఈయన త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్లు ఇటీవల తన బ్లాగ్ ద్వారా ఎనౌన్స్ చేసాడు. ఎప్పటి నుంచో డైరక్షన్ ఆసక్తి ఉన్నప్పటికీ సరైన కథ కుదరకపోవడంతో ఇంత కాలం వెయిట్ చేస్తూ వచ్చిన ఈయన పోర్చుగీస్ బ్యాక్ డ్రాప్ లో సాగే `బరోజ్` అనే పీరియాడికల్ ఫిలిం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
త్రీడీ లో పలు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు మోహన్ లాల్ డైరక్షన్ తో పాటు టైటిల్ రోల్ పోషించనున్నాడు. వాస్కోడిగామా హయాంలో ట్రెజరర్ గా పని చేసిన బరోజ్ కు సంబంధించిన ఇతివృత్తం కావడంతో `బరోజ్` టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట. జూన్ నెల నుండి షూటింగ్ ప్రారంభించడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంపూర్ణ నటుడుగా పేరు తెచ్చుకున్న ఈ హీరో , దర్శకుడుగా ఎంత వరకు సక్సెస్ అవుతాడన్నది చూడాలి మరి అంటున్నారు మాలీవు డ్ జనాలు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
