రామ్‌చరణ్ నిజంగా ఇంత సింపుల్‌గా ఉంటాడా..?
on Jul 17, 2017
.jpg)
మనుషుల్ని..వారి ప్రవర్తనను డబ్బు శాసిస్తుందంటారు పెద్దలు..అందుకు మన చుట్టూ ఎన్నో ఉదాహరణలు. పేదరికాన్ని అనుభవించి కష్టపడి మంచి స్థితిగా వచ్చినవారు చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారు..కానీ డబ్బులో పుట్టి..డబ్బులో పెరిగిన వారు ఒక విధంగా ఉంటారు.. గర్వం, మేమే గొప్ప అనే భావం వారి ముఖంలో, ప్రవర్తనలో స్పష్టం కనిపిస్తుంది..అలాంటిది తండ్రి మెగాస్టార్, కోట్లాదిమంది అభిమానుల అండదండలు, కోట్ల రూపాయల ఐశ్వర్యం ఉన్నవారు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా..కానీ ఆ వ్యక్తి అలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా చాలా సాదాసీదా జీవితాన్ని గడిపితే..అతను ఎవరో మీకు ఎవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆయనే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. ఈ విషయం చెప్పింది మేం కాదు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. దర్శకుడు ఆడియో లాంచ్ సందర్భంగా చెర్రీని ఆకాశానికెత్తేశాడు సుక్కు. రంగస్థలం షూటింగ్ టైంలో చరణ్ అంటే ఏమిటో బాగా తెలిసిందని.. గోల్డెన్ స్పూన్‌లో పుట్టిన చరణ్ చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటాడని ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిని అనే గర్వం రామ్‌చరణ్‌లో కొంచెం కూడా ఉండదని ప్రశంసించాడు. తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న రెండో సినిమా ఆడియో లాంఛ్‌కు చరణ్ ముఖ్యఅతిధిగా రావడం సంతోషంగా ఉందన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



