సినిమాలకు గుడ్‌బై చెప్పిన మంచు మనోజ్..! కారణం ఇదేనా..?
on Jun 14, 2017

యంగ్ హీరో మంచు మనోజ్ సంచలన నిర్ణయం తీసుకుని టాలీవుడ్‌ను షాక్‌కు గురిచేశాడు. తాను ఇకపై సినిమాలు చేయనని ప్రస్తుతం చేస్తున్న ఒక్కడు మిగిలాడుతో పాటు ఇప్పటికే అంగీకరించిన మరో సినిమా పూర్తి చేసిన తర్వాత ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించాడు. తన ఫేస్‌బుక్ ద్వారా మనోజ్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఉన్నపళంగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన మనోజ్..మొదట చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్‌లో బాలనటుడిగా కనిపించాడు. ఆ తర్వాత హీరోగా దొంగదొంగది, శ్రీ, ప్రయాణం, మిస్టర్ నూకయ్య, వేదం, కరెంట్ తీగ, గుంటూరోడు, తదితర చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఒక్కడు మిగిలాడు సినిమాలో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అయితే వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న మనోజ్ సినిమాల నుంచి తప్పుకుని రాజకీయాలవైపు ఫోకస్ చేయబోతున్నాడంటూ ఫిల్మ్‌నగర్‌లో చర్చించుకుంటున్నారు. కారణం ఏదైనా మనోజ్ నిర్ణయం టాలీవుడ్‌లోని అతని స్నేహితులను ఉలిక్కిపడేలా చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



