English | Telugu

పెదరాయుడు పాత్రలో మంచు మనోజ్!!

on Sep 12, 2018

 

'పెదరాయుడు' సినిమా ఓ ట్రెండ్ సెట్టర్.. పెదరాయుడుగా మోహన్ బాబు నట విశ్వరూపం చూపించారు.. ఇక ఆ సినిమాలో పాపారాయుడు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. రజినీకాంత్ పోషించిన ఈ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ఇప్పుడు అలాంటి పాత్రలోనే మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కనిపించబోతున్నాడు.. శ్రీకాంత్‌ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్‌ 2019’.. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో మంచు మనోజ్‌కుమార్‌, సునీల్‌ కీలక పాత్రలు చేస్తున్నారు.. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.. ఈ సందర్భంగా లొకేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ.. ‘శ్రీకాంత్‌గారితో నాకిది రెండో సినిమా.. చెన్నైలో జరిగిన ఒక ఘటన ఆధారంగా నేను ఈ సినిమా స్టార్ట్‌ చేశా.. సునీల్‌గారు కథ విన్న వెంటనే అంగీకరించారు.. మనోజ్‌గారు కథ వినగానే ‘పెదరాయుడు’లో రజనీకాంత్‌గారి పాత్రలా ఉంది.. సూపర్‌.. నేను చేస్తున్నా’ అని వెంటనే అంగీకరించారు’ అన్నారు.. మరి పాపారాయుడు తరహా పాత్రలో మనోజ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here