సెక్స్ బాంబు ఫ్రెంచి బాబును పట్టేసింది
on Mar 17, 2016
ఈ మధ్య భారత సినిమా భామలందరూ జాగ్రత్తగా ఫారిన్ కుర్రాళ్లను తగులుకుంటున్నారు. ఫారినర్స్ కూడా ఇండియన్స్ తో డేటింగ్ కు బాగానే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రీతి జింతా లాస్ ఏంజిల్స్ బాబును, ఇలియానా ఆస్ట్రేలియా బిడ్డనూ పట్టేశారు. లేటెస్ట్ గా బాలీవుడ్ సెక్స్ బాంబ్ గా పేరు సంపాదించుకున్న మల్లికా షెరావత్ కూడా ఒక ఫ్రెంచి పౌరుడిని పడేసింది. అదేనండీ ప్రేమలో. అంతేకాదు. ఇతనితో పీకల్లోతు ప్రేమల్లో మునిగి తేలుతున్నానంటూ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో అందరికీ పరిచయం చేస్తోంది.
విషయంలోకి వెళ్తే, ఒక న్యూస్ పేపర్ " మల్లికా షెరావత్ ఫ్రెంచి బిజినెస్ మ్యాన్ సిరెల్లీ ఆగ్జిన్ ఫ్యాన్స్ తో డేటింగ్ లో మునిగి తేలుతోంది. వ్యాలెంటైన్స్ డే రోజున మల్లికకు ఆయన ఒక కారును గిఫ్ట్ గా ఇచ్చాడు " అని రాసింది. వేరే ఎవరైనా అయితే అదంతా ఉత్తుత్తిదే. పుకార్లు నమ్మొద్దు అనేవారేమో. కానీ అక్కడున్నది మల్లికా శెరావత్ కదా. డైరెక్ట్ గా బోల్డ్ గా ఒప్పేసుకుంది. అంతేకాదు, ఆ ఆర్టికల్ ను తన ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రేమ అనేది ప్రపంచంలోనే అద్భుతమైన ఫీలింగ్ అంటూ ఆ ఆర్టికల్ కు సపోర్ట్ గా ట్వీట్ చేసింది. అటుపక్క బిజినిస్ మ్యాన్ కు కూడా మల్లిక అంటే పిచ్చిపిచ్చిగా ఇష్టమట. ఇప్పటికే ఒకసారి పెళ్లై విడాకులు తీసుకుని, ఆ తర్వాత చాలామందితో డేటింగ్ చేసి బోర్లా పడ్డ మల్లిక ఈ సారైనా పెళ్లి వరకూ వెళ్లాలని, అది నిలబడాలని కోరుకుందాం మరి.