చంద్రబాబు క్లిప్పింగులు తెప్పించుకొని మరీ చూస్తున్నాడట!
on Jul 8, 2017

అక్కినేని నాగేశ్వరరావు, అర్జున్, మోహన్ లాల్, రానా... ఈ నలుగురూ పోషించిన పాత్ర ఒకటుంది. అదే ‘ముఖ్యమంత్రి’పాత్ర. అక్కినేని.. ముఖ్యమంత్రిగా నటించిన సినిమాపేరు ‘ముఖ్యమంత్రి’. ఇక అర్జున్ అనగానే ‘ఒకే ఒక్కడు’ఎలాగూ గుర్తొస్తుంది. మోహన్ లాల్ ‘ఇధ్దరు’లో సీఎంగా నటిస్తే, మన రానా ‘లీడర్’సీఎంగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
ఇప్పుడు ఇదంతా దేనికంటే... ఈ లిస్ట్ లోకి త్వరలో మరో హీరో కూడా చేరబోతున్నాడు. అతనెవరో చాలామందికి ఇప్పటికే తెలుసు. ఎస్.. ‘మహేశ్ బాబు’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘భరత్ అను నేను’ చిత్రంలో మహేశ్ సీఎంగా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న చిత్రం మూడో షెడ్యూల్ ఈ నెల 13న హైదరాబాద్ లో మొదలు కానుంది. కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్ లో నటిస్తారని సమాచారం.
ఇందులో మహేశ్ బాబు గెటప్ సినిమాకు హైలైట్ గా ఉంటుందని తెలిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గెటప్ ని పోలి వుండేలా ఇందులో మహేశ్ గెటప్ ఉంటుందని విశ్వసనీయ సమాచారం. అందుకోసం ప్రిన్స్ గడ్డం కూడా పెంచుతున్నారట. ఏపీ సీఎం కు సంబంధించిన క్లిప్పింగులు చూడమని దర్శకుడు కొరటాల శివ చెప్పిన సలహా మేరకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సీడీలను తెప్పించుకొని చూస్తున్నారట మహేశ్. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలు తెలియాల్సివుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలో మురుగుదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘స్పైడర్’ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



