పూరీ-మహేష్ జనగణమనకు నిర్మాత దొరకలేదా..?
on Apr 29, 2016

నిన్నటితో పూరీ మహేష్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమాకు పదేళ్లు నిండిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూరీ మహేష్ తో మరో సినిమా చేయబోతున్నానని ప్రకటించేశారు. సినిమాకు జనగణమన అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే, దానిలో ఎటువంటి వివరాలూ కనిపించలేదు. మహేష్ బాబు ముఖం, జాతీయ జెండా, జనగణమన అనే టైటిల్, ఎ పూరీ జగన్నాథ్ ఫిల్మ్ అనే ట్యాగ్ లైన్..ఇవే ఆ పోస్టర్లో కనిపించాయి. సినిమా ప్రకటించారంటే, కనీసం నిర్మాణ సంస్థ పేరు లేకుండా పోస్టర్ పడదు. మరి పోస్టర్లో ఆ డిటెయిల్ ఎందుకు లేదు..? పూరీకి నిర్మాత దొరకలేదా..? లేక తన సొంత బ్యానర్ లో తీస్తున్నాడా..? ఒకవేళ నిర్మాత దొరక్కుండానే పూరీ టైటిల్ ను అనౌన్స్ చేసేస్తే మాత్రం అది తొందరపాటే అవుతుంది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో పూరీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పూరీ మహేష్ కాంబోలో భారీ బడ్జెట్ తీయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవచ్చు. దానికి తోడు రీసెంట్ గా డిస్ట్రిబ్యూటర్లతో ఆయనకు గొడవ కూడా అయింది. అయితే తన సొంత బ్యానర్లోనే పూరీ ఈ సినిమాను నిర్మిస్తాడా..? మహేష్ సినిమా అంటే దాదాపు 50 కోట్లకు పైగానే బడ్జెట్ ఉంటుంది. అంత బడ్జెట్ కు పూరీ సాహసిస్తాడా..? వరసగా సినిమాలు కమిట్ అయి ఉన్న మహేష్ తో ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు పూరీయే చెప్పాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



