English | Telugu

మలయాళ సూపర్ స్టార్ హీరోగా మహానేత బయోపిక్!

on Jan 3, 2018

 

సినిమా పరిశ్రమలో కథ పరంగా ఒక్కో టైమ్.. ఒక్కొ తరహా కథలు రాజ్యమేలుతుంటాయ్. కొన్నాళ్లు యాక్షన్ కథలు, కొన్నాళ్లు ఫ్యాక్షన్ కథలు, కొన్నాళ్లు కుటుంబ కథలు, ఇంకొన్నాళ్లు కామెడీ కథలు...ఇలా అనమాట. ప్రస్తుతం తెలుగు సిినిమా చూపంతా... బయోపిక్ కథవైపే ఉంది.  ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.  అన్న నందమూరి తారక రామారావు కథతో ఏకంగా మూడు బయోపిక్ లు షురూ అయ్యాయ్. క్రీడా తేజం పుల్లెల గోపిచంద్ కథాంశం కూడా తెరకెక్కనున్నంది.  ఇవి చాలవన్నట్లు వీటితో పాటు ఇప్పుడు మరో బయోపిక్ కూడా చేరింది. అదే వైయస్ రాజశేఖరరెడ్డి బయోపిక్.  ’ఆనందోబ్రహ్మ’ ఫేం మహి రాఘవన్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే... వైయస్ పాత్ర చేయడానికి తెలుగు నుంచి ఏ ఒక్క అగ్ర కథానాయకుడూ ముందుకు రాకపోవడం గమనార్హం. కారణం... అధికార పక్షమైన తెలుగుదేశంతో పగ పెంచుకోవడం దేనికనేది వారి అభిప్రాయం. ఎందుకంటే.. కథ రిత్యా చంద్రబాబు పాత్రను విమర్శించాల్సొస్తుంది. అందుకే... మన హీరోలందరూ ‘నో’ చెప్పేశారని టాక్. ఎన్టీయార్ గా బాలకృష్ణ లాంటి టాప్ స్టార్ చేస్తున్నప్పుడు.. వైయస్ బయోపిక్ ను కూడా అదే స్థాయి టాప్ స్టార్ చేయాలనేది దర్శకుని ఆలోచన. అందుకే... ప్రస్తుతం దర్శకుడు హీరో కోసం అన్వేషణలో పడ్డాడు.

తెలుగు హీరోలు ఈ కథలో నటించడానికి సిద్ధంగా లేదని ఇప్పటికే తేలిపోయింది. అందుకే... పరభాషా కథానాయకులవైపు దర్శకుని చూపి మళ్లింది. ఈ కథకు ఈ పాత్ర సరైన న్యాయం చేసే కెపాసిటీ మలయాళ సూపర్ స్టార్ మముట్టికి మాత్రమే ఉందనేది ఆయన అభిప్రాయం. అందుకే త్వరలో మముట్టిని మహి కలవనున్నాడట. పరాయి రాష్ట్రం వారైతే రాజకీయ వత్తిళ్లు ఉండవనేది దర్శకుని ఆలోచన.

దర్శకుడు మహి రాఘవన... అనుకున్నట్టు మముట్టి ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తే... ఓ గొప్ప ప్రాజెక్ట్ రూపాంతరం చెందడం ఖాయం. వైయస్ జీవితంలో కూడా ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయ్. రూపాయి డాక్టర్ గా ఆయన సేవలందించడం... తర్వాత రాజకీయ రంగప్రవేశం... చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరడం... ఈ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు. ముఖ్యమంత్రిగా పేదలకోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు..  ఆయన హయాంలో జరిగిన పలు హత్యలు.  హెలికాప్టర్ ప్రమాదంలో మరణం..ఇవన్నీ.. ఆసక్తిని రేకెత్తించే విషయాలే. చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ముందుకెళ్తుందో. కొంపదీసి.. దీని దారిలోనే ఇంకొన్ని వైయస్ బయోపిక్ లు పుట్టవు కదా!


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here